మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Parankusa Ashtakam – శ్రీ పరాంకుశాష్టకమ్


త్రైవిద్యవృద్ధజనమూర్ధవిభూషణం యత్
సంపచ్చ సాత్త్వికజనస్య యదేవ నిత్యమ్ |
యద్వా శరణ్యమశరణ్యజనస్య పుణ్యం
తత్సంశ్రయేమ వకులాభరణాఙ్ఘ్రియుగ్మమ్ || 1 ||

భక్తిప్రభావ భవదద్భుతభావబన్ధ
సన్ధుక్షిత ప్రణయసారరసౌఘ పూర్ణః |
వేదార్థరత్ననిధిరచ్యుతదివ్యధామ
జీయాత్పరాఙ్కుశ పయోధిరసీమ భూమా || 2 ||

ఋషిం జుషామహే కృష్ణతృష్ణాతత్త్వమివోదితమ్ |
సహస్రశాఖాం యోఽద్రాక్షీద్ద్రావిడీం బ్రహ్మసంహితామ్ || 3 ||

యద్గోసహస్రమపహన్తి తమాంసి పుంసాం
నారాయణో వసతి యత్ర సశఙ్ఖచక్రః |
యన్మణ్డలం శ్రుతిగతం ప్రణమన్తి విప్రాః
తస్మై నమో వకులభూషణ భాస్కరాయ || 4 ||

పత్యుః శ్రియః ప్రసాదేన ప్రాప్త సార్వజ్ఞ సమ్పదమ్ |
ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీపరాఙ్కుశమ్ || 5 ||

శఠకోపమునిం వన్దే శఠానాం బుద్ధిః దూషకమ్ |
అజ్ఞానాం జ్ఞానజనకం తిన్త్రిణీమూల సంశ్రయమ్ || 6 ||

వకులాభరణం వన్దే జగదాభరణం మునిమ్ |
యశ్శ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా || 7 ||

నమజ్జనస్య చిత్త భిత్తి భక్తి చిత్ర తూలికా
భవాహి వీర్యభఞ్జనే నరేన్ద్ర మన్త్ర యన్త్రణా |
ప్రపన్న లోక కైరవ ప్రసన్న చారు చన్ద్రికా
శఠారి హస్తముద్రికా హఠాద్ధునోతు మే తమః || 8 ||

వకులాలఙ్కృతం శ్రీమచ్ఛఠకోప పదద్వయమ్ |
అస్మత్కులధనం భోగ్యమస్తు మే మూర్ధ్ని భూషణమ్ || 9 ||

ఇతి శ్రీపరాశరభట్టరాచార్య కృత శ్రీ పరాఙ్కుశాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.